ACTION ALREADY COMPLETED AT A PAST MOMENT
గతంలో ఏదైనా ఒక సంఘటన జరిగిన సమయానికి, అప్పటికే వేరొక పని పూర్తి అయిపోయింది అని చెప్పడానికి కూడా Past Perfect Tense ఉపయోగిస్తారు.
ఈ భావాన్ని when, by the time, already ఉపయోగించి తెలియజేయవచ్చు.
ఎప్పుడూ కూడా ముందు జరిగిన పనిని Past perfect tense లో చెప్పాలి
తరువాత జరిగిన పనిని Simple past లో చెప్పాలి
When + తరువాత జరిగిన పని + ముందు జరిగిన పని
By the time + తరువాత జరిగిన పని + ముందు జరిగిన పని
Already + ముందు జరిగిన పని+ తరువాత జరిగిన పని
| 1. When I reached the office, the manager had left. వెన్ ఐ రీచ్డ్ ది ఆఫీస్, ద మేనేజర్ హ్యాడ్ లెఫ్ట్. |
నేను కార్యాలయానికి చేరుకునేసరికి మేనేజర్ వెళ్లిపోయారు. |
| When I reached the office, the manager had not left. | నేను కార్యాలయానికి చేరుకునేసరికి మేనేజర్ వెళ్లిపోలేదు. |
| Had the manager left when I reached the office? | నేను కార్యాలయానికి చేరుకునేసరికి మేనేజర్ వెళ్లిపోయారా? |
| Hadn’t the manager left when I reached the office? | నేను కార్యాలయానికి చేరుకునేసరికి మేనేజర్ వెళ్లిపోలేదా? |
| 2. When she opened the fridge, the milk had spoiled. వెన్ షీ ఓపెండ్ ద ఫ్రిజ్, ద మిల్క్ హ్యాడ్ స్పాయిల్డ్. |
ఆమె ఫ్రిజ్ తెరిచేసరికి పాలు పాడైపోయాయి. |
| When she opened the fridge, the milk had not spoiled. | ఆమె ఫ్రిజ్ తెరిచేసరికి పాలు పాడైపోలేదు. |
| Had the milk spoiled when she opened the fridge? | ఆమె ఫ్రిజ్ తెరిచేసరికి పాలు పాడైపోయాయా? |
| Hadn’t the milk spoiled when she opened the fridge? | ఆమె ఫ్రిజ్ తెరిచేసరికి పాలు పాడైపోలేదా? |
| 3. When we entered the hall, the speech had begun. వెన్ వి ఎంటర్డ్ ద హాల్, ద స్పీచ్ హ్యాడ్ బిగన్. |
మేము హాలులోకి ప్రవేశించేసరికి ప్రసంగం ప్రారంభమైంది. |
| When we entered the hall, the speech had not begun. | మేము హాలులోకి ప్రవేశించేసరికి ప్రసంగం ప్రారంభం కాలేదు. |
| Had the speech begun when we entered the hall? | మేము హాలులోకి ప్రవేశించేసరికి ప్రసంగం ప్రారంభమైందా? |
| Hadn’t the speech begun when we entered the hall? | మేము హాలులోకి ప్రవేశించేసరికి ప్రసంగం ప్రారంభం కాలేదా? |
| 4. By the time I woke up, my father had gone out. బై ద టైమ్ ఐ వోక్ అప్, మై ఫాదర్ హ్యాడ్ గాన్ అవుట్. |
నేను నిద్రలేచేసరికి మా నాన్న బయటకు వెళ్లిపోయారు. |
| By the time I woke up, my father had not gone out. | నేను నిద్రలేచేసరికి మా నాన్న బయటకు వెళ్లలేదు. |
| Had my father gone out by the time I woke up? | నేను నిద్రలేచేసరికి మా నాన్న బయటకు వెళ్లిపోయారా? |
| Hadn’t my father gone out by the time I woke up? | నేను నిద్రలేచేసరికి మా నాన్న బయటకు వెళ్లిపోలేదా? |
| 5. By the time the doctor arrived, the bleeding had stopped. బై ద టైమ్ ద డాక్టర్ అరైవ్డ్, ద బ్లీడింగ్ హ్యాడ్ స్టాప్ట్. |
డాక్టర్ వచ్చేసరికి రక్తస్రావం ఆగిపోయింది. |
| By the time the doctor arrived, the bleeding had not stopped. | డాక్టర్ వచ్చేసరికి రక్తస్రావం ఆగలేదు. |
| Had the bleeding stopped by the time the doctor arrived? | డాక్టర్ వచ్చేసరికి రక్తస్రావం ఆగిందా? |
| Hadn’t the bleeding stopped by the time the doctor arrived? | డాక్టర్ వచ్చేసరికి రక్తస్రావం ఆగలేదా? |
| 6. By the time we reached the bakery, it had sold all the bread. బై ద టైమ్ వి రీచ్డ్ ద బేకరీ, ఇట్ హ్యాడ్ సోల్డ్ ఆల్ ద బ్రెడ్. |
మేము బేకరీకి చేరుకునేసరికి అక్కడ బ్రెడ్ అంతా అమ్మేశారు. |
| By the time we reached the bakery, it had not sold all the bread. | మేము బేకరీకి చేరుకునేసరికి అక్కడ బ్రెడ్ అంతా అమ్మేయలేదు. |
| Had it sold all the bread by the time we reached the bakery? | మేము బేకరీకి చేరుకునేసరికి అక్కడ బ్రెడ్ అంతా అమ్మేశారా? |
| Hadn’t it sold all the bread by the time we reached the bakery? | మేము బేకరీకి చేరుకునేసరికి అక్కడ బ్రెడ్ అంతా అమ్మేయలేదా? |
| 7. She had already washed the clothes when I offered to help. షీ హ్యాడ్ ఆల్రెడీ వాష్ట్ ద క్లోత్స్ వెన్ ఐ ఆఫర్డ్ టు హెల్ప్. |
నేను సహాయం చేస్తానని చెప్పేసరికి ఆమె అప్పటికే బట్టలు ఉతికింది. |
| She had not washed the clothes when I offered to help. | నేను సహాయం చేస్తానని చెప్పేసరికి ఆమె బట్టలు ఉతకలేదు. |
| Had she already washed the clothes when I offered to help? | నేను సహాయం చేస్తానని చెప్పేసరికి ఆమె అప్పటికే బట్టలు ఉతికిందా? |
| Hadn’t she already washed the clothes when I offered to help? | నేను సహాయం చేస్తానని చెప్పేసరికి ఆమె అప్పటికే బట్టలు ఉతకలేదా? |
| 8. He had already booked a room when I called him. హీ హ్యాడ్ ఆల్రెడీ బుక్ట్ ఎ రూమ్ వెన్ ఐ కాల్డ్ హిమ్. |
నేను అతనికి ఫోన్ చేసేసరికి అతను అప్పటికే గది బుక్ చేశాడు. |
| He had not booked a room when I called him. | నేను అతనికి ఫోన్ చేసేసరికి అతను గది బుక్ చేయలేదు. |
| Had he already booked a room when I called him? | నేను అతనికి ఫోన్ చేసేసరికి అతను అప్పటికే గది బుక్ చేశాడా? |
| Hadn’t he already booked a room when I called him? | నేను అతనికి ఫోన్ చేసేసరికి అతను అప్పటికే గది బుక్ చేయలేదా? |
| 9. They had already chosen a name when the baby was born. దే హ్యాడ్ ఆల్రెడీ చోజన్ ఎ నేమ్ వెన్ ద బేబీ వజ్ బోర్న్. |
బిడ్డ పుట్టేసరికి వారు అప్పటికే ఒక పేరు ఎంచుకున్నారు. |
| They had not chosen a name when the baby was born. | బిడ్డ పుట్టేసరికి వారు పేరు ఎంచుకోలేదు. |
| Had they already chosen a name when the baby was born? | బిడ్డ పుట్టేసరికి వారు అప్పటికే ఒక పేరు ఎంచుకున్నారా? |
| Hadn’t they already chosen a name when the baby was born? | బిడ్డ పుట్టేసరికి వారు అప్పటికే ఒక పేరు ఎంచుకోలేదా? |
| 10. We had already ordered food by the time Ravi joined us. వి హ్యాడ్ ఆల్రెడీ ఆర్డర్డ్ ఫుడ్ బై ద టైమ్ రవి జాయిన్డ్ అస్. |
రవి మాతో చేరేసరికి మేము అప్పటికే భోజనం ఆర్డర్ చేశాము. |
| We had not ordered food by the time Ravi joined us. | రవి మాతో చేరేసరికి మేము భోజనం ఆర్డర్ చేయలేదు. |
| Had we already ordered food by the time Ravi joined us? | రవి మాతో చేరేసరికి మేము అప్పటికే భోజనం ఆర్డర్ చేశామా? |
| Hadn’t we already ordered food by the time Ravi joined us? | రవి మాతో చేరేసరికి మేము అప్పటికే భోజనం ఆర్డర్ చేయలేదా? |