IS

IS

 ప్రియమైన స్టూడెంట్స్  AM, IS, ARE, WAS, WERE, వీటినే  సాదారణంగా  Be Forms  అని అంటారు.

వీటిలో Am, Is, Are లను Present Be forms అని  అంటారు.  Was ,Were లను Past Beforms  అని అంటారు.

Is= అనగా  ఉన్నది,  ఉన్నాడు, అని అర్దం .

సింగులర్ సబ్జెక్టులు  అయిన He, She, It, that లకు మాత్రమే “is” ఉపయోగిస్తారు.

 

 

Is ని   ఏఏ సందర్భాలలో ఉపయోగిస్తారో  తెలుసుకుందాం.

1.Present continuous tense

Is ని  Present continuous tense  లో ఉపయోగిస్తారు. ఇది మనం Tenses లో తెలుసుకున్నాము. ఒక పని  ప్రస్తుతం  కంటిన్యూగా జరుగుతున్నప్పుడు  ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని  ఉపయోగిస్తారు. 

ఒక సెంటెన్స్ లో సబ్జెక్టులు గా  He, She, It, that  ఉన్నప్పుడు verb4 ఉపయోగించి  వాక్య నిర్మాణం చేస్తారు. 

Example: 

He is coming to hear  =  అతను ఇక్కడికి వస్తూ ఉన్నాడు.

Negative Sentence  గా మార్చుటకు Is ప్రక్కన  not  చేరిస్తే సరిపోతుంది. 

He is not coming to here  = అతను ఇక్కడికి రావడం లేదు.

పై రెండు వాక్యాలను ప్రశ్న వాక్యాలుగా మార్చుటకు Is  ని సెంటెన్సెస్ ప్రారంభంలో ఉంచితే సరిపోతుంది.

Is he coming to hear? =  అతను  ఇక్కడికి వస్తూ ఉన్నాడా?.

Is he not coming to here? = అతని ఇక్కడికి  రావడం లేదా?.

1.He is reading a book. అతను ఒక పుస్తకం చదువుతూ ఉన్నాడు
He is not reading a book. అతను పుస్తకం చదవడం లేదు.
Is he reading a book? అతను పుస్తకం  చదువుతూ ఉన్నాడా?
Is he not reading a book? అతను పుస్తకం చదవడం లేదా?
   
2. She is cooking food. ఆమె వంట  చేస్తూ ఉంది
She is not cooking food. ఆమె వంట చేయడం లేదు.
Is she cooking food? ఆమె వంట  చేస్తూ ఉందా?
Is she not cooking food? ఆమె వంట చేయడం లేదా?
   
3. It is raining outside. బయట వర్షం పడుతూ ఉంది.
It is not raining outside. బయట వర్షం పడటం లేదు.
Is it raining outside? బయట వర్షం  పడుతూ ఉందా?
Is it not raining outside? బయట వర్షం పడటం లేదా?
   
4. That is working properly. అది సరిగ్గా  పనిచేస్తూ ఉంది.
That is not working properly. అది సరిగ్గా పనిచేయడం లేదు.
Is that working properly? అది సరిగ్గా  పని చేస్తూ ఉందా?
Is that not working properly? అది సరిగ్గా పనిచేయడం లేదా?
   
5. Ravi is playing cricket. రవి క్రికెట్  ఆడుతూ ఉన్నాడు.
Ravi is not playing cricket. రవి క్రికెట్ ఆడటం లేదు.
Is Ravi playing cricket? రవి క్రికెట్  ఆడుతూ ఉన్నాడా?
Is Ravi not playing cricket? రవి క్రికెట్ ఆడటం లేదా?
   
6. Sumathi is learning English. సుమతి ఇంగ్లీష్  నేర్చుకుంటూ ఉంది.
Sumathi is not learning English. సుమతి ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు.
Is Sumathi learning English? సుమతి ఇంగ్లీష్  నేర్చుకుంటూ ఉందా?
Is Sumathi not learning English? సుమతి ఇంగ్లీష్  నేర్చుకోవడం లేదా?

 

2.Emotions

ప్రస్తుత సబ్జెక్టు యొక్క స్థితి గురించి తెలియజేయడానికి

Subject + is+ adjective

Is = ఉన్నది, ఉన్నాడు

Adjective = సబ్జెక్టు యొక్క గుణాన్ని స్థితిని తెలియజేస్తుంది

క్రింద కొన్ని adjective words గమనించండి

Beautiful అందమైన
Strong బలమైన
Clever తెలివైన
Brave ధైర్యముగల.
Honest నిజాయితీ గల
Kind దయగల
Rich ధనవంతమైన.
Poor పేద
Tall పొడవైన
Short చిన్నది / కొద్దిగా
Heavy భారమైన
Light తేలికైన
Sweet తీయని
Bitter చేదు
Angry కోపంగా

 

She is beautiful. ఆమె అందంగా ఉంది.
He is strong. అతను బలంగా ఉన్నాడు.
Ravi is clever. రవి తెలివైనవాడు.
The boy is brave. ఆ అబ్బాయి ధైర్యవంతుడు.
She is honest. ఆమె నిజాయితీగల వ్యక్తి.
My teacher is kind. మా ఉపాధ్యాయుడు దయగలవాడు.
He is rich. అతను ధనవంతుడు.
He is poor. అతను పేదవాడు.
The tree is tall. ఆ చెట్టు పొడవుగా ఉంది.
The boy is short. ఆ అబ్బాయి పొట్టిగా ఉన్నాడు.
This box is heavy. ఈ పెట్టె బరువుగా ఉంది.
This bag is light. ఈ సంచి తేలికగా ఉంది.
This mango is sweet. ఈ మామిడి పండు తియ్యగా ఉంది.
This medicine is bitter. ఈ మందు చేదుగా ఉంది.
Sumathi is angry. సుమతి కోపంగా ఉంది.

 

Adjective ప్రధానంగా సబ్జెక్టు  యొక్క స్థితిని,  గుణాన్ని తెలియజేస్తుంది. 

Is + Adjective ఉపయోగించినప్పుడు ప్రస్తుత సబ్జెక్ట్ యొక్క స్థితిని గుణాన్ని తెలియజేస్తారు

Subject + is+ verb3

కొన్నిసార్లు verb3 కూడా adjective  లాగా సబ్జెక్ట్ యొక్క స్థితిని, గుణాన్ని తెలియజేస్తుంది.

Verb3 ఉపయోగిస్తున్నాము కాబట్టి ఇక్కడ ఏదైనా పని జరుగుతుంది అని అనుకోకూడదు. ఇక్కడ కేవలం సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేయడానికి మాత్రమే verb3  ఉపయోగించడం జరుగుతుంది.

1. He is tired. అతను అలసిపోయి ఉన్నాడు.
2. She is bored. ఆమెకు విసుగుగా ఉంది.
3. Ravi is worried. రవి ఆందోళనగా ఉన్నాడు.
4. The child is confused. ఆ పిల్లవాడు అయోమయంలో ఉన్నాడు.
5. She is excited. ఆమె ఉత్సాహంగా ఉంది.
6. The boy is frightened. ఆ అబ్బాయి భయపడి ఉన్నాడు.
7. He is pleased. అతను సంతోషంగా ఉన్నాడు.
8. She is disappointed. ఆమె నిరాశగా ఉంది.
9. The customer is satisfied. ఆ వినియోగదారుడు సంతృప్తిగా ఉన్నాడు.
10. Ravi is surprised. రవి ఆశ్చర్యపోయి ఉన్నాడు.
11. She is interested in music. ఆమెకు సంగీతంపై ఆసక్తి ఉంది.
12. He is exhausted. అతను బాగా అలసిపోయి ఉన్నాడు.
13. The baby is relaxed. ఆ పసిబిడ్డ ప్రశాంతంగా ఉంది.
14. She is prepared for the exam. ఆమె పరీక్షకు సిద్ధంగా ఉంది.
15. The player is injured. ఆ ఆటగాడు గాయపడి ఉన్నాడు.
16. The phone is damaged. ఆ ఫోన్ పాడై ఉంది.
17. The chair is broken. ఆ కుర్చీ విరిగి ఉంది.
18. The door is closed. తలుపు మూసి ఉంది.
19. The gate is locked. గేటుకు తాళం వేసి ఉంది.
20. The bus is crowded. బస్సు జనంతో కిక్కిరిసి ఉంది.

ఈ విధంగా సందర్భాన్ని బట్టి  verb3 ఉపయోగించి సబ్జెక్టు ప్రస్తుత స్థితిని తెలియజేయవచ్చు

 

Subject + is + verb4 

కొన్ని సందర్భాలలో verb 4 కూడా adjective లాగా సబ్జెక్ట్ యొక్క స్థితిని తెలియజేస్తుంది. Verb4 ఉపయోగిస్తున్నాము కాబట్టి ఇక్కడ ఏదైనా పని జరుగుతుంది అని అనుకోకూడదు.  verb4 ని  కేవలం సబ్జెక్ట్  యొక్క  స్థితిని తెలియజేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాము. క్రింది ఉదాహరణలు గమనించండి

 

1. Ravi is inspiring. రవి ఇతరులకు స్ఫూర్తినిచ్చే వ్యక్తి.
2. Sita is charming. సీత ఆకట్టుకునేలా ఉంది.
3. Ramesh is entertaining. రమేష్ ఇతరులను వినోదపరుస్తాడు.
4. The teacher is encouraging. ఆ ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రోత్సహించే వ్యక్తి.
5. The speaker is convincing. ఆ వక్త మాటలు నమ్మకం కలిగించేలా ఉన్నాయి.
6. Ravi is annoying. రవి ప్రవర్తన ఇతరులకు చిరాకు కలిగిస్తోంది.
7. The actor is amusing. ఆ నటుడు ఇతరులకు వినోదం కలిగిస్తున్నాడు.
8. The coach is demanding. ఆ కోచ్ తన శిష్యుల నుంచి ఎంతో కృషిని ఆశిస్తాడు.
9. The story is interesting. ఆ కథ ఆసక్తికరంగా ఉంది.
10. The movie is boring. ఆ సినిమా విసుగు కలిగిస్తోంది.
11. The game is exciting. ఆ ఆట ఉత్సాహం కలిగిస్తోంది.
12. The news is shocking. ఆ వార్త దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
13. The lesson is confusing. ఆ పాఠం అయోమయం కలిగిస్తోంది.
14. The question is challenging. ఆ ప్రశ్న సవాలుగా ఉంది.
15. The result is surprising. ఆ ఫలితం ఆశ్చర్యకరంగా ఉంది.
16. The music is relaxing. ఆ సంగీతం ప్రశాంతతను కలిగిస్తోంది.
17. The journey is tiring. ఆ ప్రయాణం అలసట కలిగిస్తోంది.
18. The situation is worrying. ఆ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.
19. The smell is disgusting. ఆ వాసన అసహ్యం కలిగిస్తోంది.
20. The ending is disappointing. ఆ ముగింపు నిరాశ కలిగిస్తోంది.

Verb 4 ఉపయోగించినప్పుడు  అది ఇతరులను ప్రభావితం చేసే లక్షణంగా కనబడుతుంది.

He is boared = అతనికి విసుగుగా ఉంది.

He is boaring = అతను ఇతరులకు విసుగు కలిగిస్తాడు.

పై రెండు లక్షణాలు వేరు వేరు అని గమనించండి.

ఈ విధంగా సబ్జెక్టు  సింగులర్  కాబట్టి మనం ఇప్పుటి  వరకు is  ఉపయోగించాం.సబ్జెక్టు Plural అయితే are ఉపయోగిస్తాము.

He, She, Itలకు is  ఉపయోగిస్తాము

We,you,they లకు are ఉపయోగిస్తాము

I కి am ఉపయోగిస్తాము 

పై విధంగా సబ్జెక్టులను అప్లై చేసి అన్ని వాక్యాలు అర్థం చేసుకోండి

 

 

3.DUMMY “IT” AS A SUBJECT

It is 6 o’clock.

పై వాక్యాన్ని గమనించండి ఇక్కడ it  ఎలా వచ్చింది. సమయాన్ని గురించి, తేదీని గురించి ,వాతావరణాన్ని గురించి, దూరం గురించి, కొన్ని పరిస్థితుల గురించి చెప్పేటప్పుడు it ఉపయోగిస్తారు.

సమయం సాయంత్రం ఐదు గంటలు అయింది, ఈరోజు సోమవారం, ఐదు కిలోమీటర్ల దూరం ఉంది, ఇది చాలా కష్టంగా ఉంది. సబ్జెక్టు లేని ఇటువంటి వాక్యాలు చెప్పాల్సి వచ్చినప్పుడు it ని  డమ్మీ subject  గా ఉపయోగిస్తారు. ఇటువంటి వాక్యాలలో It కి అర్థం ఉండదు.  అవసరం మాత్రమే ఉంటుంది.  

It ని  ఎటువంటి వాక్యాలలో ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం

A. Time (సమయం)

It is 6 o’clock. 6 గంటలైంది.
It is 7 am. ఉదయం 7 గంటలైంది.
It is 10 pm. రాత్రి 10 గంటలైంది.
It is early. ఇది తొందరగా ఉంది.
It is late. ఆలస్యమైంది.
It is time for school. బడికి వెళ్ళే సమయం అయింది.
It is time to eat. తినడానికి సమయం అయింది.
It is noon now. ఇప్పుడు మధ్యాహ్నం అయింది.
It is midnight. అర్ధరాత్రి అయింది.
It is the right time. ఇది సరైన సమయం.

B. Date (తేదీ / రోజు)

It is Monday. ఈ రోజు సోమవారం.
It is Sunday today. ఈరోజు ఆదివారం.
It is January 1st. ఇది జనవరి 1వ తేదీ.
It is my birthday today. ఈరోజు నా పుట్టినరోజు.
It is a holiday. ఇది సెలవుదినం.
It is New Year’s Day. ఇది నూతన సంవత్సర దినోత్సవం.
It is the first day of the month. ఇది నెలలో మొదటి రోజు.
It is the last day of the year. ఇది సంవత్సరం చివరి రోజు.
It is a working day. ఇది పని దినం.
It is a special day. ఇది ఒక ప్రత్యేకమైన రోజు.

C. Weather (వాతావరణం)

It is hot today. ఈరోజు వేడిగా ఉంది.
It is cold outside. బయట చలిగా ఉంది.
It is sunny. ఎండగా ఉంది.
It is cloudy. మబ్బుగా ఉంది.
It is cool in the morning. ఉదయం చల్లగా ఉంటుంది.
It is warm now. ఇప్పుడు వెచ్చగా ఉంది.
It is windy today. ఈరోజు గాలులు వీస్తున్నాయి.
It is dry here. ఇక్కడ ఎండగా ఉంది.
It is pleasant weather. ఇది ఆహ్లాదకరమైన వాతావరణం.
It is bad weather. వాతావరణం బాగోలేదు.

D. Distance (దూరం)

It is five kilometers from here. ఇది ఇక్కడి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
It is very far. ఇది చాలా దూరం.
It is very near. ఇది చాలా దగ్గరగా ఉంది.
It is two miles away. అది రెండు మైళ్ళ దూరంలో ఉంది.
It is a long distance. ఇది చాలా దూరం.
It is a short distance. ఇది కొద్ది దూరం.
It is far from my house. ఇది నా ఇంటికి చాలా దూరంలో ఉంది.
It is near the bus stop. అది బస్ స్టాప్ దగ్గర ఉంది.
It is ten minutes from here. ఇక్కడి నుండి పది నిమిషాల దూరంలో ఉంది.
It is close to the school. అది స్కూల్ కి దగ్గరగా ఉంది.

E. Situation (కొన్ని పరిస్థితులు)

It is easy to learn English. ఇంగ్లీష్ నేర్చుకోవడం సులభం.
It is difficult to understand. అర్థం చేసుకోవడం కష్టం.
It is important for students. విద్యార్థులకు ఇది ముఖ్యం.
It is good for health. ఇది ఆరోగ్యానికి మంచిది.
It is bad for children. ఇది పిల్లలకు చెడ్డది.
It is possible now. అది ఇప్పుడు సాధ్యమే.
It is not possible today. ఈరోజు అది సాధ్యం కాదు.
It is my mistake. అది నా తప్పు.
It is your turn. ఇప్పుడు మీ వంతు.
It is a problem. ఇది ఒక సమస్య.

 

 

3.Physical condition : ప్రస్తుత సబ్జెక్టు యొక్క శారీరిక స్థితి గురించి తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

He is tired. అతను అలసిపోయి వున్నాడు .
She is weak. ఆమె బలహీనంగా ఉంది.
The boy is sick. ఆ అబ్బాయికి అనారోగ్యంగా ఉంది.
My father is strong. నాన్నబలంగా వున్నాడు .
The man is injured. ఆ వ్యక్తి గాయ పది వున్నాడు .
The child is hungry. పిల్లవాడు  ఆకలిగా వున్నాడు .
She is sleepy. ఆమె నిద్రలో వుంది .

4.Mental state:ప్రస్తుత  సబ్జెక్టు యొక్క మానసిక స్థితి గురించి తెలియజేయడానికిIS ఉపయోగిస్తారు. 

He is confident. అతను నమ్మకంగా ఉన్నాడు.
She is confused. ఆమె అయోమయంలో ఉంది.
Ravi is relaxed. రవి ప్రశాంతంగా ఉన్నాడు.
Sumathi is worried. సుమతి ఆందోళగా వుంది .
The student is focused. విద్యార్థి ఏకాగ్రతతో ఉన్నాడు.
He is careless. అతను నిర్లక్ష్యంగా ఉన్నాడు.
She is alert. ఆమె అప్రమత్తంగా ఉంది.

 

5.Identity:ప్రస్తుత  సబ్జెక్టు యొక్క గుర్తింపుని లేదా సంబందాన్ని  తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

Ravi is my friend. రవి నా స్నేహితుడు.
She is my sister. ఆమె నా చెల్లి.
He is the leader. ఆయన ఒక నాయకుడు.
The boy is a hero. ఆ అబ్బాయి ఒక హీరో.
Sumathi is my neighbor. సుమతి నా పొరుగుది .
This man is a stranger. ఈ మనిషి ఒక అపరిచితుడు.
She is the winner. ఆమె విజేతగా వుంది.

 

6.Profession: ప్రస్తుత  సబ్జెక్టు యొక్క వృత్తిని గురించి తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

He is a teacher. అతను ఒక ఉపాధ్యాయుడు.
She is a doctor. ఆమె ఒక వైద్యురాలు.
Ravi is a driver. రవి ఒక డ్రైవర్.
Sumathi is a nurse. సుమతి ఒక నర్సు.
My father is a farmer. నాన్న ఒక రైతు.
He is an engineer. అతను ఒక ఇంజనీర్.
She is a tailor. ఆమె ఒక దర్జీ.

 

7.Age: ప్రస్తుత  సబ్జెక్టు యొక్క వయస్సు గురించి తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

 

He is ten years old. అతనికి పదేళ్ళు.
She is eight years old. ఆమెకు ఎనిమిది సంవత్సరాలు.
The boy is five. ఆ అబ్బాయికి ఐదు సంవత్సరాలు.
The girl is twelve. ఆ అమ్మాయికి పన్నెండు సంవత్సరాలు.
Ravi is thirty. రవి వయసు ముప్పై.
Sumathi is twenty. సుమతి వయసు ఇరవై.
My sister is sixteen. నా చెల్లికి పదహారేళ్లు.

8.Location:ప్రస్తుతం సబ్జెక్టు యొక్క స్థలాన్ని గురించి తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

He is at home. అతను ఇంట్లో ఉన్నాడు.
She is in the room. ఆమె గదిలో ఉంది.
The book is on the table. పుస్తకం టేబుల్ మీద ఉంది.
Ravi is at school. రవి స్కూల్లో ఉన్నాడు.
Sumathi is in the office. సుమతి ఆఫీసులో ఉంది.
The cat is under the chair. పిల్లి కుర్చీ కింద ఉంది.
My father is outside. నాన్న బయట ఉన్నారు.

 

 9.Time: ప్రస్తుత సమయాన్ని గురించి తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

Today is Monday. ఈరోజు సోమవారం.
Tomorrow is a holiday. రేపు సెలవు.
It is six o’clock. ఆరు గంటలైంది.
Now is the right time. ఇదే సరైన సమయం.
Yesterday is history. నిన్నటిది చరిత్ర.
This is the first day. ఇది మొదటి రోజు.
It is morning now. ఇప్పుడు ఉదయం అయింది.

 

10. Cost: ధర గురించి తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

This pen is ten rupees. ఈ పెన్ను పది రూపాయలు.
The book is cheap. ఆ పుస్తకం చౌక.
The phone is costly. ఆ ఫోన్ ఖరీదైనది.
That bag is expensive. ఆ బ్యాగ్ ఖరీదైనది.
This watch is valuable. ఈ గడియారం విలువైనది.
The shirt is affordable. ఆ చొక్కా ధర సరసమైనది.
The item is free. ఈ వస్తువు ఉచితం.

 

11.Quality : గుణాన్ని గురించి తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

The dress is beautiful. ఆ డ్రెస్ చాలా అందంగా ఉంది.
The road is narrow. రోడ్డు ఇరుకుగా ఉంది.
The answer is correct. సమాధానం సరైనది.
The idea is good. ఆలోచన బాగుంది.
The work is perfect. పని పరిపూర్ణంగా ఉంది.
The plan is simple. ప్రణాళిక సులభం.
The story is interesting. కథ ఆసక్తికరంగా ఉంది.

12.Size:పరిమాణం గురించి తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

The room is big. ఆ గది పెద్దది.
The box is small. ఆ పెట్టె చిన్నది.
The house is large. ఆ ఇల్లు చాలా పెద్దది.
The bag is heavy. ఆ సంచి బరువుగా ఉంది.
The bottle is light. బాటిల్ తేలికగా ఉంది.
The tree is tall. ఆ చెట్టు పొడవుగా ఉంది.
The table is short. టేబుల్ చిన్నగా ఉంది.

13. Color: ప్రస్తుత సబ్జెక్టు యొక్క రంగు గురించి తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

The flower is red. పువ్వు ఎరుపు రంగులో ఉంటుంది.
The sky is blue. ఆకాశం నీలంగా ఉంది.
The dress is white. ఆ డ్రెస్ తెల్లగా ఉంది.
The car is black. కారు నల్లగా ఉంది.
The leaf is green. ఆకు ఆకుపచ్చగా ఉంటుంది.
The flag is colorful. జెండా రంగురంగులది.
The wall is yellow. గోడ పసుపు రంగులో ఉంది.

14.Number (singular sense): సబ్జెక్టు యొక్క నంబర్ స్థితి తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

The answer is one. సమాధానం ఒకటి.
The boy is alone. ఆ అబ్బాయి ఒంటరిగా ఉన్నాడు.
The room is single. ఆ గది సింగిల్.
The item is unique. ఆ వస్తువు ప్రత్యేకమైనది.
The student is first. విద్యార్థి మొదటివాడు.
The prize is one. బహుమతి ఒకటి.
The ticket is single. టికెట్టు సింగిల్.
The bus is late. బస్సు ఆలస్యమైంది.

 

15.Situation :సబ్జెక్టు యొక్క స్థితిని గురించి తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

The shop is open. దుకాణం తెరిచి ఉంది.
The door is closed. తలుపు మూసి ఉంది.
The road is busy. రోడ్డు రద్దీగా ఉంది.
The class is silent. తరగతి నిశ్శబ్దంగా ఉంది.
The bus is late. బస్సు ఆలస్యమైంది.
The area is safe. ఆ ప్రాంతం సురక్షితంగా ఉంది.
The office is crowded. ఆఫీసు రద్దీగా ఉంది.

 

16.Possession:సబ్జెక్టు ప్రస్తుతం ఏమి కలిగి ఉన్నాడో తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. .

This book is mine. ఈ పుస్తకం నాది.
That house is his. ఆ ఇల్లు అతనిది.
The bag is hers. ఆ బ్యాగ్ ఆమెదే.
The land is Ravi’s. ఆ భూమి రవిది.
The phone is Sumathi’s. ఆ ఫోన్ సుమతిది.
This pen is yours. ఈ పెన్ను మీదే.
The responsibility is mine. బాధ్యత నాది.

ఇవి మాత్రమే కాకుండా

 సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మరియు  ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్న ఒక  సెంటెన్స్ ని,  ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు కూడా is వస్తుంది.