ONGOING ACTIONS IN THE PAST

ONGOING ACTIONS IN THE PAST

Past perfect continuous tense           

గతంలో ఒక పని ప్రారంభించబడి కొంత సమయ వ్యవధిలో కొన్ని గంటలుగా లేదా నెలలుగా వారాలగా జరుగుతూ ఉండిన పనులను నొక్కి చెప్పడానికి Past perfect continuous tense ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఈ పనులు లేవు అవి గతంలో జరిగిపోయినవి.

Past perfect continuous tense లో వాక్య  నిర్మాణం చేయటానికి అన్ని సబ్జెక్టులకు (He, She, It, I, We, You, They)  Had been అనే సహాయక క్రియను  ఉపయోగించి Verb 4 ఉపయోగించాలి. 

He, She, It, I, We, You, They Had been V4 Obgect

Sub + Had been + V4  + Obgect

.

1. I had been working there for five years. నేను అక్కడ ఐదు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉండినాను
   
2.She had been studying English before the exam. ఆమె పరీక్షకు ముందు  ఇంగ్లీష్ చదువుతూ ఉండింది
   
3.They had been playing cricket all day. వాళ్ళు రోజంతా క్రికెట్  ఆడుతూ ఉండినారు.
   
4.We had been waiting for the bus for an hour. మేము గంటపాటు బస్ కోసం  వేచి ఉండినాము
   
5.He had been teaching students for a long time. ఆయన చాలా కాలం విద్యార్థులకు బోధిస్తూ ఉండినాడు
   
6.I had been living in Kavali for many years. నేను చాలా సంవత్సరాలుగా కావలిలో నివసిస్తూ ఉండినాను
   
7.She had been reading that book for a week. ఆమె ఆ పుస్తకాన్ని ఒక వారం పాటు చదువుతూ ఉండింది
   
8.They had been preparing for the exam since Monday. వారు సోమవారం నుండి పరీక్షకు సిద్ధపడుతూ ఉండినారు
   
9.We had been discussing the issue for a long time. మేము చాలా కాలంగా ఈ విషయం గురించి చర్చిస్తూ ఉండినాము.
   
10.He had been working in that company before he resigned. అతను రాజీనామా చేసే ముందు ఆ కంపెనీలో పనిచేస్తూ ఉండినాడు
   
11. I had been learning English before I started teaching. నేను బోధించడం ప్రారంభించడానికి ముందు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండినాను
   
12. She had been cooking food for hours. ఆమె గంటల తరబడి ఆహారం వండుతూ ఉండింది
   
13. They had been traveling all night. వారు రాత్రంతా ప్రయాణం చేస్తూనే ఉండినారు.
   
14. We had been practicing spoken English daily. మేము రోజూ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండినాము
   
15. He had been running the shop for ten years. అతను పది సంవత్సరాలుగా ఆ దుకాణాన్ని నడుపుతూ ఉండినాడు
   
16. I had been writing notes since morning. నేను ఉదయం నుండి నోట్స్ రాసుకుంటూ ఉండినాను
   
17. She had been watching TV for two hours. ఆమె రెండు గంటలుగా టీవీ చూస్తూనే ఉండింది.
   
18. They had been cleaning the house all day. వాళ్ళు రోజంతా ఇంటిని శుభ్రం చేస్తూనే ఉండినారు
   
19. We had been waiting outside before the gate opened. గేటు తెరవడానికి ముందే మేము బయట వేచి ఉండినాము.
   
20. He had been saving money for his business. అతను తన వ్యాపారం కోసం డబ్బు ఆదా చేస్తూ ఉండినాడు.
He had not been saving money for his business. అతను తన వ్యాపారం కోసం డబ్బు ఆదా చేస్తూ ఉండలేదు
Had he been saving money for his business? అతను తన వ్యాపారం కోసం డబ్బు ఆదా చేస్తూ ఉండినాడా .?
Had he not been saving money for his business? అతను తన వ్యాపారం కోసం డబ్బు ఆదా చేస్తూ ఉండ లేదా.?

 

కింద ఉన్న ఆరు  పాయింట్స్ దాదాపు ఒకే విధంగా ఉంటాయి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు